భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజరోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారితో గతవారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 28,701 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8, 78,254కు చేరింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,01,609 మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 5,53,471 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనాతో 500 మంది మరణించారు.

      దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో 18850 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. జూలై 12 వరకు 1,18,06,256 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ ప్రకటించింది. ఆదివారం ఒక్కరోజే 2,19,103 నమూనాలు పరీక్షించామని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here