చైనాతో గాల్వన్‌ లోయ ఘర్షణల్లో భారత సైనికులు మరణించడం దేశవ్యాప్తంగా జాతీయతా భావాన్ని పురికొల్పింది. ఇది చైనాపైనా, చైనా ఉత్పత్తులపైనా వ్యతిరేకతకు దారితీసింది. ఈ నేపథ్యంలో చైనా యాప్‌లను ప్రభుత్వమే నిషేధించడంతో స్వదేశీ ఉత్పత్తులు, దేశీయ సాంకేతికతను బలంగా ప్రోత్సహించినట్టయింది. అనేక దేశీయ యాప్‌లు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలిమెంట్స్‌ అనే యాప్‌ కూడా రంగంలోకి దిగింది.

      ఈ సోషల్‌ మీడియా యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇది తొలి దేశీయ సోషల్‌ మీడియా యాప్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలిమెంట్స్‌ యాప్‌ ద్వారా యూజర్లు వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, పర్సనల్‌, గ్రూప్‌ చాట్‌ చేసుకోవడానికి వీలవుతుంది. మున్ముందు కాన్ఫరెన్స్‌ కాల్స్‌, డిజిటల్‌ చెల్లింపులు కూడా ఈ యాప్‌ లో పొందుపరచనున్నారు. ఈ యాప్‌ ను ఇప్పటికే లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ రూపకల్పనలో వందల సంఖ్యలో ఐటీ నిపుణులు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వలంటీర్లు పాలుపంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here