తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. నానాటికి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.  రాష్ట్రంలో ఏకంగా 983 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

      అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీకి కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌-19 పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో జూబ్లీహిల్స్ లోని అసోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న ఐదుగురు గన్‌మెన్‌ లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఇటీవల హోంమంత్రితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.       ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో శానిటైజ్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న మహమూద్‌ అలీ మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు అస్తమా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here