తెలంగాణలో కరోనా కేసుల గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలలో కరోనా పరీక్షలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కరోనా చికిత్సను పెంచడానికి గాను తెలంగాణలోని మూడు ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉచితంగా వైద్యం అందించడానికి ముందుకొచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏ మండలంలోనైనా బెడ్‌ ల కొరత లేదని నిర్ధారించేందుకు గాను ఈ ప్రయత్నం మొదలు పెట్టడం జరిగిందని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తెలిపారు. కరోనా వచ్చిన వ్యక్తులతో పాటు, లక్షణాలు ఉన్నా ఇక్కడ పరీక్షలు జరపడంతో పాటు ఉచితంగా చికిత్స అందించనున్నారు.   

    ఇందులో భాగంగా తొలుత మూడు ప్రైవేట్‌ మెడికట్‌ కాలేజీలు మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్‌ కాలేజీలను ఎంపిక చేసింది. అదేవిధంగా మరో ఏడు ప్రైవేటు బోధనా ఆస్పత్రులను కూడా త్వరలో ఈ జాబితాలో చేర్చనున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం 98 దవాఖానలు, విశ్లేషణ కేంద్రాలు వీలైనంత త్వరగా కేసులను గుర్తించడానికి పరీక్షలు చేయడానికి సదుపాలయాలను కలిగి ఉన్నాయి. స్వయం చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, కరోనా చికిత్సకు సంబంధించిన వారి ప్రశ్నలను పరిష్కరించడానికి హోంక్వారంటైన్‌లో ఉన్నవారి కోసం కాల్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here