తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఇవాళ ఒక్కరోజే6,988 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,06,737కు చేరింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 89 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంవ్యాప్తంగా ఇప్పటి వరకు  కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,409కి పెరిగింది. ఇప్పటివరకు 1,51,055 మంది ఈ మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం 52,273 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలో కరోనా తీవ్రత తమిళనాడులోనే ఎక్కువగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here