బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చివ‌రి చిత్రం దిల్ బేచారా ఇవాళ రాత్రి 7.30 నిమిషాల‌కు డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ కానున్న‌ది. 2014లో రిలీజైన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ద ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్‌కు రీమేక్‌గా తీశారు. ముఖేశ్ చ‌బ్రా డైర‌క్ట‌ర్‌గా చేశాడు.  జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఫిల్మ్ రిలీజ్ సంద‌ర్భంగా బాలీవుడ్ సెల‌బ్ర‌టీలు ట్వీట్ల‌తో హోరెత్తించారు. సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అంఖిత లోఖండే కూడా ఇన్‌స్టాలో కామెంట్‌  చేసింది. నువ్వెక్క‌డ ఉన్నా.. న‌వ్వుతూనే ఉండాలంటూ ఆమె త‌న ఇన్‌స్టాలో పెట్టింది. దిల్ బేచారా పోస్టర్ చూస్తుంటేనే తెగ టెన్ష‌న్ పుడుతోంద‌ని హీరోయిన్ శిల్పా శెట్టి ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. మ‌రోవైపు సుశాంత్ డెత్ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌న్న డిమాండ్ పెరుగుతూనే ఉన్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here