తనదైన మాటలతో, తెలంగాణ యాసతో, వేషధారణతో టీవీ వీక్షలకు దగ్గరైన నటుడు బిత్తిరి సత్తి. వీ6 తీన్మార్ న్యూస్ తో టీవీకి పరిచయమై అతి తక్కువ కాలంలో ఎంతోమంది అభిమానం పొందాడు. అమాయకపు మాటలు, చేష్టలతో నవ్వించాడు. మంచి టీమ్ తోడుగా సావిత్రి ఉండటంతో బిత్తిరి సత్తి తీన్మార్ న్యూస్ మొత్తం తెలుగు న్యూస్ ఛానెళ్లలో టాప్ ప్రోగ్రాం అయ్యింది. తీన్మార్ చూసి మిగతా ఛానెళ్లు అలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాయి. వీ6 నుంచి ఎక్కువ సాలరీ కోరి టీవీ 9కు వచ్చాడు సత్తి. ఇస్మార్ట్ న్యూస్ ప్రారంభించాడు.

      ఈ కార్యక్రమం కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది. వీ6 లక్ష రూపాయల జీతమిస్తే… 4 లక్షలకు టీవీ 9 సత్తిని తెచ్చుకుంది. మొన్న ఫాదర్సే రోజున ఇస్మార్ట్ న్యూస్ లో ఒక స్కిట్ లో సత్తి ఫాదర్ ఫొటో ఉంచే సీన్ లో వాళ్ల నాన్న ఫొటో పెట్టాడట. ఇలా ఎందుకు చేశావనే చర్చ ఛానెల్ లో మొదలై సత్తి బయటకొచ్చేందుకు కారణమైంది.

      ఇకా ఇప్పుడు తాజాగా బిత్తిరి సత్తి అనే రవికుమార్ సాక్షి టీవీలో అడుగుపెట్టబోతున్నాడు. 7.5 లక్షల రూపాయల భారీ సాలరీ ఆయనకు సాక్షి ఆఫర్ చేసిందని సమాచారం. సత్తితో పాటు ఆయన టీంమేట్ రైటర్ కుమార్ కూడా సత్తితో సాక్షిలో చేరుతున్నాడు. వీ6 తీన్మార్, టీవీ 5 మల్లన్న న్యూస్, హెచ్ఎంటీవీ జోర్దార్ వార్తల, టీ న్యూస్ ధూంధాం ముచ్చట ఇవి ఎక్కువ రేటింగ్ తెచ్చుకుంటున్నాయి. వీటితో సాక్షి టీవీ పోటీ పడేందుకు సిద్ధమవుతోందన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here