టాలీవుడ్ హీరో  దగ్గుబాటి రానా పెళ్లికి తేదీ ఖారారైంది. తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను రానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవలె ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగష్టు 8న జరిగే వివాహ వేడుకతో ఈ ప్రేమజంట ఒకటి కానుంది. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరుగనుంది. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల్లో  ఈ పెళ్లి నిర్వహించనున్నారట.

      ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలని సురేష్ బాబు భావిస్తున్నారట. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరినీ పెళ్లికి ఆహ్వానించాలనుకుంటున్నారట. త్వరలో రానా స్వయంగా ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి ఆహ్వాన పత్రికలను అందించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here