బీజింగ్‌ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో A72 5G స్మార్ట్‌ ఫోన్‌ను ఇవాళ చైనాలో లాంచ్‌ చేసింది. గత జూన్‌లో 4G వేరియంట్‌ను విడుదల చేసింది.  4G మోడల్‌తో పోలిస్తే కొత్త వేరియంట్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.  4G వేరియంట్‌లో ఉన్న స్నాప్‌డ్రాగన్‌ 665కు బదులుగా మీడియాటెక్‌ ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. ఒప్పో A72 5Gలో  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, హోల్‌ పంచ్‌  సెల్ఫీ కెమెరా ఉన్నాయి.   ఫోన్‌ మూడు కలర్లలో అందుబాటులో ఉండగా  ధర రూ.20,200గా నిర్ణయించారు. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. 

ఒప్పో A72 5G ఫీచర్లు..

  • డిస్‌ప్లే : 6.50 అంగుళాల
  • ఫ్రంట్‌ కెమెరా: 16 మెగా పిక్సల్‌
  • రియర్‌ కెమెరా: 16+8+2 మెగా పిక్సల్‌
  • ర్యామ్‌: 8GB
  • స్టోరేజ్‌: 128GB
  • బ్యాటరీ: 4040mAh
  • ఓఎస్‌: ఆండ్రాయిడ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here