ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, పోలీసులు ఇలా కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే రాష్టం మొత్తాన్ని చుట్టేసిన ఈ వైరస్‌ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఏ మూల నుండి వస్తుందో… ఎవరి నుండి వ్యాపిస్తుందో కూడా తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోయారు. కాగా తాజాగా తమిళనాడుకు చెందిన ఓ టీవీ చానెల్‌లో పనిచేస్తున్న రిపోర్టర్‌ మృతి చెందారు. తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతిలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న మణి ఇకలేడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి పాత్రికేయులు కన్నీరుమన్నీరవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రిపోర్టింగ్‌ చేస్తున్న ఇలాంటి జర్నలిస్టులను కరోనా కబళించడం బాధాకర విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here