ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వేలల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 2,593 కేసులు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38,044కి చేరింది. కరోనా కారణంగా ఒక్కరోజే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వల్ల 492 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 18,159 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా… మరో 19,393 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 22,304 నమూనాలను పరీక్షించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన మరణాలు…

  • తూర్పు గోదావరి – 8
  • ప్రకాశం – 8
  • చిత్తూరు – 5
  • కడప – 4
  • అనంతపురం – 3
  • గుంటూరు – 3
  • నెల్లూరు – 3
  • విశాఖపట్నం – 3
  • కర్నూలు – 1
  • శ్రీకాకుళం – 1
  • విజయనగరం – 1

గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు వివరాలు…

  • అనంతపురం – 174
  • చిత్తూరు – 205
  • తూర్పు గోదావరి – 500
  • గుంటూరు – 139
  • కడప – 126
  • కృష్ణా – 132
  • కర్నూలు – 590
  • నెల్లూరు – 126
  • ప్రకాశం – 104
  • శ్రీకాకుళం – 111
  • విశాఖపట్నం – 81
  • విజయనగరం – 101
  • పశ్చిమ గోదావరి – 195

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here