మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 9,251 కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ మహమ్మారి వల్ల 257 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,66,368కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,45,481 చేరగా.. ఇప్పటివరకూ 2,07,194 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.
ఇదిలావుండగా.. ముంబైలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 1,090 కరోనా పాజిటివ్ కేసులు.. 52 మంది ప్రాణాలు కోల్పోయాయి. 617 మంది వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ ముంబై తెలిపింది. దీంతో నగరంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 1,07,981కు చేరుకుంది. ఇందులో 78,877 మంది రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 6,033 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలో అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచి ధారావిలో నేడు 10 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here