ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు. మొత్తం 9.50 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ తొలి సంవత్సర ఫలితాల్లో 2.88 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 60.10 శాతం మంది విద్యార్థులు మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వివరించారు. 67.4 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 52,30 శాతం మంది పాసయ్యారని తెలిపారు.

        రెండో సంవత్సర ఫలితాల్లో 2.83 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రెండో సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. 71.15 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలుర ఉత్తీర్ణత శాతం 62.10 గా నమోదైందని వెల్లడించారు. తొలి సంవత్సర ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ జిల్లా అగ్రస్థానంలో నిలవగా… రెండో సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీమ్‌ జిల్లా తొలి స్థానంలో నిలిచిందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here