భారత సైన్యం 89 యాప్‌ లను వినియోగించకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో ఫేస్‌ బుక్‌, ఇన్ట్స్‌ గ్రామ్‌ వంటి ప్రముఖ యాప్‌ లు కూడా ఉన్నాయి. సైన్యంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు బ్యాన్‌ చేసిన 89 యాప్‌ లలో ఏ ఒక్క దాన్ని కూడా వినియోగించకూడదని.. ఫోన్లలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశించింది.

      జూలై 15 లోపు 89 యాప్‌లను మొబైల్‌ ఫ్లోన్ల నుంచి తొలగించాలని పేర్కొంది. ప్రస్తుత ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది. టిక్‌టాక్‌, హెలో, షేర్‌ఇట్‌ సహా ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. గతేడాది నవంబర్‌ లోనూ అధికారిక పనుల కోసం వాట్సాప్‌ ను ఉపయోగించకూడదని సైన్యం ఆదేశించిన సంగతి తెలిసిందే.   

    ఫేస్ బుక్‌ ఖాతాల్లోని సున్నితమైన సమాచారాన్ని తొలగించాలని సూచించింది. మహిళల పేరుతో పాకిస్థాన్‌ ఏజెంట్లు భారత సైనికులను వలపు ఉచ్చులోకి దించుతున్న ఘటనలు రెండు మూడేళ్లుగా ఎక్కువయ్యాయి. ఫేస్‌బుక్‌ వాడొద్దని, కార్యాలయాల్లోకి, నావల్‌ డాక్‌ల్లోకి మొబైళ్లు తీసుకు రావొద్దని భారత నౌకాదళం సైతం తమ సిబ్బందిని ఇంతకు ముందే ఆదేశించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here