ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల  సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 4944 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్టవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఈ మహమ్మారి కారణంగా ఇవాళ ఒక్కరోజే 62 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 758 కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 13,86,274 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వివిధ ఆస్పత్రుల్లో.. క్వారంటైన్‌ కేంద్రాల్లో 32,336 మంది చికిత్స పొందుతున్నారు. కాగా 25,574 మంది వైరస్‌ నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఒక్కరోజే 62 మంది చనిపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది.

రాష్ట్రంలో ఒక్కరోజే నమోదైన  మరణాలు..

  • తూర్పు గోదావరి – 10
  • విశాఖపట్నం – 9
  • చిత్తూరు – 8
  • శ్రీకాకుళం – 7
  • అనంతపురం – 6
  • పశ్చిమ గోదావరి – 6
  • గుంటూరు – 5
  • ప్రకాశం – 5
  • కర్నూలు – 4
  • కడప – 1

రాష్ట్రంలో ఒక్కరోజే నమోదైన కేసుల వివరాలు..

  • అనంతపురం – 458
  • చిత్తూరు – 560
  • తూర్పుగోదావరి – 524
  • గుంటూరు – 577
  • కడప – 322
  • కృష్ణా – 424
  • కర్నూలు 515
  • నెల్లూరు – 197
  • ప్రకాశం – 171
  • శ్రీకాకుళం – 133
  • విశాఖపట్నం – 230
  • విజయనగరం – 210
  • పశ్చిమ గోదావరి – 623

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here