ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత బెంబేలెత్తిస్తున్నది. ఎన్ని చర్యలు తీసుకున్నా మహమ్మారి వైరస్‌ నియంత్రణలోకి రాని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేలల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,84,196 కేసులు నమోదైనట్లు WHO వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. వీటిలో సగానికి పైగా కేసులు అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లోనే రికార్డు కావడం గమనార్హం.

  • అమెరికాలో కరోనా బారిన శుక్రవారం ఒక్కరోజే 1000 మందికి పైగా ప్రానాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 1,48,490కి చేరింది. అదేవిధంగా యూఎస్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు80 వేల నిర్ధారణ కావడంతో..ఇప్పటి వరకు అమెరికాలో కేసుల సంఖ్య 42,48,327కి పెరిగింది.
  • దక్షిణ కొరియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మార్చి తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం 113 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య 14,092కు చేరింది. కొత్త కేసుల్లో ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ను సమర్థవతంగా కట్టడి చేసిన అతికొన్ని దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి.
  • ఇక బ్రెజిల్‌లో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 55,891 కేసులు బయటపడ్డాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 23,43,366కు చేరింది. అదేవిధంగా ఈ మహమ్మారి వల్ల మరో 1,156 మంది మృతి చెందగా .. అక్కడ ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 85,238కు పెరిగింది.
  • మెక్సికోలో తాజాగా 7,573పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 737 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 3,78,285కు పెరిగింది. అదేవిధంగా కరోనా మహమ్మారితో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 42,645కు పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here