ఇండియాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 9,36,181కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా కలవర పెడుతోంది. తాజాగా మరో 582 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 24,309 కి పెరిగింది.       దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉండగా, వైరస్‌ బారినపడినవారిలో 5,92,032 మంది బాధితులు కోలుకున్నారు. జూలై 14 వరకు 1,24,12,664 నమూనాలను పరీక్షించామని ఐసీఎమ్మార్‌ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 3,20,161 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here