తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1,284 కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 43,780కి పెరిగింది. అలాగే ఇప్పటివరకు కరోనా బారిన పడి 409 మంది ప్రాణాలు కోల్పోయారు.

      రాష్ట్రవ్యాప్తంగా 12,765 యాక్టివ్‌ కేసులు ఉండగా.. నిన్న ఒక్కరోజే 1,902 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. నిన్న ఒక్కరోజే 14,883 శాంపిళ్లు పరీక్షించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,52,700 శాంపిళ్లు పరీక్షించినట్లు తెలుస్తోంది.

నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు…

 • జీహెచ్‌ఎంసీ – 667
 • రంగారెడ్డి – 68
 • మేడ్చల్‌ – 62
 • సంగారెడ్డి – 86
 • ఖమ్మం – 10
 • కామారెడ్డి – 2
 • వరంగల్‌ రూరల్‌ – 37
 • వరంగల్‌ అర్బన్‌ – 5
 • నిర్మల్‌ – 1
 • కరీంనగర్‌ – 58
 • జగిత్యాల – 1
 • యాదాద్రి – 10
 • పెద్దపల్లి – 14
 • మెదక్‌ – 15
 • మహబూబ్‌నగర్‌ – 16
 • మంచిర్యాల్‌ – 19
 • జయశంకర్‌ భూపాలపల్లి – 4
 • నల్గొండ – 46
 • రాజన్న సిరిసిల్ల – 2
 • అదిలాబాద్‌ – 8
 • ఆసిఫాబాద్‌ – 2
 • వికారాబాద్‌ – 35
 • నాగర్‌ కర్నూల్‌ – 1
 • జనగామ – 6
 • నిజామాబాద్‌ – 26
 • వనపర్తి – 24
 • సిద్దిపేట – 22
 • సూర్యాపేట – 23
 • గద్వాల్‌ – 14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here