భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40,425 పాజిటివ్‌ కేసులు నమోదయయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కు చేరింది. నిన్న ఒక్కరోజే 681 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.  దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 27,497కు చేరింది.

       ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,90,459 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మరో 7,00,087 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన వారం రోజులలోనే దేశవ్యాప్తంగా 2 లక్షల 40 వేల పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63 శాతం ఉండగా.. మరణాల రేటు 2.5గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here