సరిహద్దులో శత్రు సైన్యానికి ఎదురొడ్డి జాతి కోసం వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని అశ్రునయనాలతో.. సైనిక అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. సంతోష్‌ కుమారుడు అనిరుధ్‌ చిన్న వయసు కావడంతో సంతోష్‌ తండ్రి ఉపేందర్ తోడు రాగా..అనిరుధ్‌తో తలకొరివి పెట్టించారు. కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనుకులు గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. జనం భారీగా తరలి వచ్చి వీరుడికి నివాళులర్పించారు. 

        పలువురు రాజకీయ ప్రముఖులు కల్నల్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి అంత్యక్రియలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో మాత్రమే  అనుమతించారు. కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

        సోమవారం రాత్రి గల్వాన్‌ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భార‌త జ‌వాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here