బీహార్‌ రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా  ఆ రాష్ట్రంలో శనివారం 2,803 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 36 వేలకుపైగా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత రెండురోజులుగా రాష్ట్రంలో వరుసగా వెయ్యికిపైగా కేసులు నమోదుకాగా ఇవాళ ఆ సంఖ్య ఏకంగా రెండువేలు దాటింది.

    రాష్ట్ర రాజధాని పాట్నాలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆగస్టు 3 నుంచి జరగాల్సిన వర్షాకాల చివరి సెషన్‌ సమావేశాలకు వేదిక సైతం మార్చారు. సామ్రాట్‌ అశోక కన్వెన్షన్‌ హాల్‌లో అసెంబ్లీ సమాశాలు నిర్వహించనున్ననట్లు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సూత్రపాయంగా తెలిపారు.

పంజాబ్‌లో కొత్తగా 468 కరోనా కేసులు..

      పంజాబ్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో పంజాబ్‌లో 468 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,684కు చేరింది. ఇందులో 4096 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 8297 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 291 మంది మృత్యువాత పడినట్లు సమాచార శాఖ అధికారులు శనివారం తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here