కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8929కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,451 నమూనాలను పరీక్షించగా 439 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

      అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. అయితే గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 4307కు చేరుకుంది. కరోనాతో ఈరోజు 5 మంది మరణించడంతో మృతుల సంఖ్య 106కు చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 4516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here