ఏపీలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 328కి పెరిగింది.

      ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గడిచిన 24 గంటల్లో 1,933 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 29,168కి చేరింది. తాజాగా 846 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,412కి చేరింది. ఇంకా 13,428 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు…

  • అనంతపురం – 129
  • చిత్తూర్‌ – 159
  • తూర్పు గోదావరి – 268
  • గుంటూర్‌ – 152
  • కడప – 94
  • కృష్ణా- 206
  • కర్నూల్‌ – 237
  • నెల్లూర్‌ – 124
  • ప్రకాశం – 134
  • శ్రీకాకుళం – 145
  • విశాఖపట్నం – 49
  • విజయనగరం – 138
  • పశ్చిమ గోదావరి – 79

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here