తెలంగాణలో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 1640 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా కొత్తగా 8 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,466 కి  చేరగా.. కరోనా బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 455 మంది  మృత్యువాత పడ్డారు. ఇవాళ 15,445 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజే మరో 1007  కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 40,334కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 11,677 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here