తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,641కి చేరింది. కరోనా వైరస్‌తో 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 356కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,883 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం 8153 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 1,703,24 మందికి టెస్టులు చేసినట్లు తెలస్తోంది.

గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు…

 • జీహెచ్‌ఎంసీ – 800
 • రంగారెడ్డి – 132
 • మెడ్చల్‌ – 94
 • సంగారెడ్డి – 36
 • ఖమ్మం -1
 • వరంగల్‌ యూ- 12
 • వరంగల్‌ ఆర్‌ -2
 • నిర్మల్‌ – 4
 • కరీంనగర్‌ – 23
 • జగిత్యాల్‌ – 4
 • యాదాద్రి – 7
 • మహబూబాబాద్‌ – 8
 • పెద్దపల్లి – 9
 • మెదక్‌ – 14
 • మహబూబ్‌నగరర్‌ -17
 • భద్రాద్రి కొత్తగూడెం – 3
 • మంచిర్యాల్‌ – 3
 • నల్కొండ – 15
 • రాజన్న సిరిసిల్ల – 3
 • అదిలాబాద్‌ – 4
 • వికారాబాద్‌ – 6
 • నాగర్‌కర్నూల్‌ – 23
 • జనగామ – 6
 • నిజామాబాద్‌ – 11
 • వనపర్తి – 15
 • సిద్దిపేట్‌ – 3
 • సూర్యాపేట్‌ – 7
 • గద్వాల్‌ – 7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here